శ్రీ జగజ్జననీ అమ్మవారికి పుట్టింటి పట్టుచీర - సారె
ప్రతి సంవత్సరం ఆషాఢమాస పట్టీ
మొదటి పళ్లెము పసుపు
రెండవ పళ్లెము కుంకుమ (గోపురం మార్క్)
మూడవ పళ్లెము పూలదండ, 3 రకాల విత్తనం పండ్లు (రకానికి 2 పండ్లు), నల్ల పూసలు, కాటుక, మైనం, చిన్న అద్దం, దువ్వెన, తాటినత్తు.
నాల్గవ పళ్లెము చీర, జాకెట్, ఒక డజను గాజులు, సెంటు (లేదా) స్ర్పే, తాంబూలము (చీర 5 1/2 మీటరు ఉండాలి. తెలుపు రంగు చీరలు, పేపర్ కాటన్ చీరలు పనికి రావు)
ఐదవ పళ్లెము 2 రకాల స్వీటు (రకానికి ఐదు). ఒక రకం కార.
1. భక్తాదులు ఎవరైనా సరే తమ వసతిని, శక్తిని బట్టి ఆషాఢ మాసంలో ఏ రోజైనా తీసుకొని రావచ్చును.
2. శక్తి వున్న వారు సుగంధ ద్రవ్యములు తీసుకొని రావచ్చును. (పచ్చ కర్పూరం, కుంకుమ పువ్వు, గంధం, ఖర్జూరాలు, ఒట్టి వ్రేళ్లు, తుంగముస్తెలు, జాజికాయ, జాపత్రి, శ్రీ గంధం చెక్క, కస్తూరి, గోరోజనము వీటిని దంచి పొడి చేసి తీసుకొని రావలెను)
3. కాయ కర్పూరం మాములే.
4. భక్తాదులు పైన తెలిపిన పూజా ద్రవ్యములను కొత్త పళ్లెము (స్థాంబానము)లలో మాత్రమే తీసుకొని రావలెను. (సంచులలో, బుట్టలలో తీసుకొని రాకూడదు).