శ్రీ జగజ్జననీ దీక్షా నియమనిష్ఠలు

 • 1. సూర్యోదయమునకు ముందు సూర్యాస్తమయం తరువాత చన్నీళ్ళతో పరిశుద్ధ శిర స్నానం చేసి శ్రీ జగజ్జననీ మాతకు దీపారాధన చేసి ఓం ఐం హ్రీం శ్రీం జగజ్జనన్యై నమ. అనే మంత్రము శ్రీ మాతను ధ్యానించాలు.
 • 2. మనసా, వాచా, కర్మణా బ్రహచర్యం పాటించాలి.
 • 3. దీక్షాకాల మందు ఎర్రని వస్ర్తములనే ధరించవలెను.
 • 4. రుద్రాక్షమాల, రక్తచందనం మాల, శమీ వృక్షం బెరడుతో చేసిన మాల లేదా ఎరుపు మాల ధరించాలి.
 • 5. ఒంటి పూట భోజం మరియు నేలపై పరుండవలెను.
 • 6. శాకహారం మాత్రమే తీసుకోవాలి (మాంసమూ, గ్రుడ్డు, మద్యము, సిగరెట్, వగైరా వాడరాదు)
 • 7. దీక్షాకాలంలో మితభాషిగా వుంటూ తప్పనిసరిగా ఒకరోజు 'నక్త వ్రతం' పాటించాలి. (అనగా ఉదయం నుండి ఉపవాస దీక్షలో కేవలం మంచి నీళ్ళతో (ఆరోగ్య విషయంలో క్షీర పానం కొందరికి) సూర్యాస్తమయం వరకు ఉపవసించి సంధ్యా స్నాన జప ధ్యానాదులు ముగించి శ్రీ జగజ్జననీ మాతను దర్శించి రాత్రి 8 గం. దాటిన మీద మితంగా భుజించాలి. ఇది నక్త వ్రతం.)
 • 8. దీక్షా కాలంలో క్షురకర్మ, గోర్లు తీయుట, చాకలికి బట్టలు వేయుట, ఇస్త్రీ చేయించుట పనికిరాదు.
 • 9. కాళ్ళకు చెప్పులు వేసుకొనరాదు.
 • 10. నుదుట గంధం, కుంకుమ బొట్టు తప్పనిసరిగా ధరించవలెను.
 • 11. చద్ది వస్తువులు, చిరు తిండ్లు, ఆకు వక్క, పాన్ పరాగ్, గుట్కాలు తినరాదు. హోటల్లలో తినడము, టీ, కాఫీ, వగైరా తాగటం చేయరాదు. ఇంటిలో మాత్రమే భిక్ష చేయాలి.
 • 12. ఒకరికొకరు ఎదురుపడినప్పుడు 'జై జగజ్జననీ' అని రెండు చేతులు జోడించి నమస్కారం చేయవలెను.
 • 13. సినిమాలు, టి.వి.లు సబ్బు వాడటం నిషేధమ3ు.
 • 14. తైల సంస్కారం, స్నో, సెంటు, పౌడర్ మొ. వాడరాదు.
 • 15. భోజనం మరియు టిఫిన్ అరటి ఆకులలో భుజించడం శ్రేష్ఠము.
 • 16. అబద్ధములాడుట, మౌసం చేయుట, జూదం పనికిరాదు. పరోపకారం, సమాజ సేవలు పాటించాలి.
 • 17. ఉదయం, సాయంత్రం 'శ్రీ జగజ్జననీ' ఆలయదర్శనం చేసుకొనవలెను.
 • 18. అంటు, మైల, బహిష్టు, శవమును చూచినపుడు ''శ్రీ జగజ్జననీ మాతా'' నామస్మరణ చేసికోవాలి. (దీని వలన దీక్షా భంగం కలుగదు)
 • 19. గురువు చేతగాని, లేదా అర్చకులతో గాని ''శ్రీ జగజ్జననీ'' దీక్షా మాలాధారణ చేసుకొనవలెను.
 • 20. నగర ప్రదక్షిణతో దీక్షా విరమణం శుభప్రదం (క్షేత్ర పాలకుడైన శ్రీ బ్రహ్మనందీశ్వరుని దర్శించి సోమ నంది, ప్రమథ నంది, నాగ నందులను కూడా దర్శించి తిరిగి బ్రహ్మనందీశ్వరుని దర్శించి శ్రీ అమ్మవారి సన్నిధికి చేరి యాగాదికం తర్వాత దీక్షా విరమణ చేయాలి).