శ్రీ జగజ్జననీ ఆలయం - ప్రాశస్త్యం
అపూర్వ శిల్ప శోభారమణీయంగా నిర్మాణంలో ఉన్న శ్రీ జగజ్జననీ ఆలయం వెలసిన నంద్యాల అనాదికాలం నుండే ప్రముఖ శైవక్షేత్రం అనే చెప్పాలి.

ఎందుకంటే ఇది నవనంది - ఆలయం ఆ విధంగా ఈ జగజ్జననీ ఆలయ క్షేత్రానికి అతి సమీప దూరంలోనే ప్రముఖ శైవక్షేత్రాలయిన శ్రీశైలం (ఆత్మకూరు రస్తా) మహానంది (నల్లమల తూర్పు) పడమన ఎర్రమలలు - నల్లమలల సంధి ప్రదేశంలో భోగేశ్వరం, ఎర్రమలలలోనే ప్రముఖ శైవక్షేత్రం యాగంటి, గుండం మల్లికార్జున స్వామి, బ్రహ్మగుండం, మద్దులేటి లక్ష్మీ నారసింహస్వామి, అహోబిల నరసింహక్షేత్రం, సర్వ నరసింహక్షేత్రం, ఇటు ప్రముఖ శక్తి స్థానమైన నందవరం చౌడేశ్వరీ నిలయం, కొత్తూరు సుబ్బరాయుడు క్షేత్రాలు అన్నీ చేరువలోనే ఉండడం జగజ్జననీ ఆలయ సందర్శకులకు ఎందో సౌకర్యంగా వుంటుంది.

ఇంకా ''ఓంకారం, నెమిలిగుండం, మోక్షగుండం, కొమ్ముచెరువు ఆంజనేయస్వామి, కాల్వబుగ్గ రామేశ్వర తీర్థం'' కూడా ఈ ఆలయ కేంద్రం నుండి అతి సులభంగా ప్రయాణింప వీలున్నంత దూరంలోనే, నిరంతరయాన సౌకర్యాలతో అలరారడం విశేషం.
కళ్యాణం-కమనీయం
శివ పార్వతులు, శ్రీ లక్ష్మీ విష్ణువు, సిద్ధి బుద్ధి విఘ్నేశ్వర, శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, బ్రహ్మ సరస్వతుల కళ్యాణము ప్రతి రోజు జరుపబడును.